Vijay Devarakonda: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • 'ఫైటర్'తో జతకట్టనున్న జాన్వీ 
  • షూటింగుకి రెడీ అవుతున్న చిరంజీవి
  • కొత్త హీరో సరసన ఐదుగురు నాయికలు    

*  విజయ్ దేవరకొండ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కథానాయికగా నటించనుంది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ 'ఫైటర్' పేరిట ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇందులో నాయికగా జాన్వీని ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.
*  'సైరా' తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి విదితమే. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగును రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుందని అంటున్నారు.  
*  ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ చిన్నబ్బాయి సాయి గణేశ్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో సాయి గణేశ్ సరసన మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తారట. వీరిలో ఇప్పటికే నటాష, దీక్ష నాగర్కర్, అనన్య అగర్వాల్ ఎంపికవగా, మరో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయాల్సి వుంది.

Vijay Devarakonda
Jahnvi Kapoor
Puri Jagannadh
Chiranjivi
  • Loading...

More Telugu News