KCR: ఆర్టీసీ కార్మికుల కోసం కేసీఆర్ కాళ్లు పట్టుకుంటా: ఎమ్మెల్యే శంకర్ నాయక్

  • ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి
  • వెంటనే చర్చలకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలి
  • మహబూబాబాద్ లో శంకర్ నాయక్

ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మెను విరమించి విధుల్లోకి చేరాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు అవసరమైతే తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళ్లు పట్టుకునేందుకు కూడా సిద్ధమని ఆయన అన్నారు. మహబూబాబాద్‌ లో మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కార్మికులు భేషజాలకు పోకుండా సమ్మెను విరమించాలని సూచించారు. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని, వెంటనే విధుల్లో చేరి, చర్చలకు రావాలని కోరారు. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న నమ్మకం తనకుందని తెలిపారు. 

KCR
Shankar Nayak
TRS
TSRTC
  • Loading...

More Telugu News