Kerala: 'విధి అత్యాచారం' వంటిదంటూ కేరళ ఎంపీ భార్య వివాదాస్పద పోస్ట్.. తర్వాత తొలగింపు!

  • వర్షం కారణంగా నీట మునిగిన ఎంపీ ఇంటి పరిసరాలు
  • ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్ట్
  • తొలగించి క్షమాపణ చెప్పిన లిండా

విధి అత్యాచారం లాంటిదని, దానిని ఎదుర్కొనే శక్తి లేకపోతే ఆస్వాదించడమే మంచిదంటూ కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ భార్య, జర్నలిస్టు ఆనా లిండా ఈడెన్ చేసిన ఫేస్‌బుక్ పోస్టు తీవ్ర వివాదాస్పదం అయింది. ఇటీవల కేరళలో కురిసిన వర్షాల కారణంగా కొచ్చిలోని ఆమె ఇంటి పరిసరాలు జలమయమయ్యాయి. దీనిపై ఆమె సరదాగా కామెంట్ చేసే ప్రయత్నంలో విమర్శల పాలయ్యారు.

వర్షంలో తడిసిన తన ఇంటి పరిసరాలు, తన భర్త ఆహారం తీసుకుంటున్న ఫొటోలను పోస్టు చేసిన లిండా.. విధి అత్యాచారం లాంటిదని, ప్రతిఘటించడం కుదరకపోతే ఎంజాయ్ చేయాలని కామెంట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓ జర్నలిస్టు చేయాల్సిన వ్యాఖ్యలు ఇవి కావని మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాల నివారణకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతుంటే, వారిని కించపరిచే పోస్టులు ఏంటంటూ విరుచుకుపడ్డారు. సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో లిండా ఉక్కిరిబిక్కిరయ్యారు. నిన్న ఉదయం ఆ పోస్టును తొలగించారు. మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ఇలాంటి పోస్టు చేసినందుకు చింతిస్తున్నానని పేర్కొన్న లిండా, క్షమించాలని వేడుకున్నారు.  

  • Loading...

More Telugu News