Tsrtc: ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదు: అధికారులతో భేటీలో సీఎం కేసీఆర్ స్పష్టీకరణ

  • అధికారులతో ముగిసిన భేటీ 
  • యూనియన్ల వల్లే ఆర్టీసీలో నష్టాలు
  • కార్మికులు తిరిగి తమ ఉద్యోగాలివ్వమన్నా ఇచ్చే పరిస్థితి లేదు

సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని సీఎం మరోసారి తెల్చిచేప్పినట్టు తెలుస్తోంది. సమ్మె నేపథ్యంలో హైకోర్టు కార్మికులతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సాగిన భేటీ ముగిసింది. 

ఇప్పటికే సమ్మెలో పాల్గొన్న కార్మికులను ఉద్యోగాల్లోంచి తీసేశామని, వారు తిరిగి ఉద్యోగాలు ఇవ్వమన్నా ఇచ్చే పరిస్థితి లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని జీతాలు పెంచమని ఎలా అడుగుతారు? అని ఆయన ప్రశ్నించారట. నష్టాలకు ఆర్టీసీ యూనియన్లే కారణమని, నష్టాల్లో ఉన్న సంస్థలో జీతాలు పెంచమని ఏ కోర్టు చెప్పదని ముఖ్యమంత్రి అన్నట్టు తెలుస్తోంది. 

ఆర్టీసీ దివాళ స్థితిని కోర్టు ముందు ఉంచాల్సిన బాధ్యత అధికారులదే అని, యూనియన్లతో లాలూచీ పడాల్సిన అవసరం తమకు లేదని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. యూనియన్లు లేని ఆర్టీసీ కావాలని సీఎం అభిప్రాయపడ్డట్టు చెబుతున్నారు. ఆల్విన్ కంపెనీ లాకౌట్ అయితే ఎవరు మాత్రం ఏం చేశారని అధికారులను ఉద్దేశించి ప్రశ్నించారట. యూనియన్లు లేకుంటే ఆర్టీసీ లాభాల బాట పడుతుందని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది.

Tsrtc
Jac
cm
kcr
Minister
Puvvada
  • Error fetching data: Network response was not ok

More Telugu News