Nirmala Sitharaman: మోదీతో సమావేశమైన నోబెల్ విజేత అభిజిత్‌ బెనర్జీ

  • దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పలు అంశాలపై చర్చ
  • ఫొటో ట్వీట్ చేసిన మోదీ
  • పలు అంశాలపై విస్తృతంగా చర్చించామని వెల్లడి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆర్థిక వేత్త, నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ భేటీ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పలు అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేస్తూ తమ భేటీకి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు. ఆయనతో భేటీ అద్భుతంగా జరిగిందని, మనుషులంతా సాధికారత సాధించాలన్న ఆయన ప్యాషన్ స్పష్టంగా తెలుస్తోందని ట్వీట్ చేశారు. పలు అంశాలపై తాము విస్తృతంగా చర్చించామని అన్నారు. ఆయన సాధించిన విజయం పట్ల భారత్ గర్విస్తోందని అన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

కాగా, మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో అభిజిత్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా పేదరిక నిర్మూలనకు ఆయన చేస్తోన్న కృషికి గానూ ఎస్తర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రిమర్‌లతో సంయుక్తంగా ఆయనకు నోబెల్ దక్కింది. ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

Nirmala Sitharaman
Abhijit Banerjee
India
  • Loading...

More Telugu News