kidney: ఆ వ్యక్తి కిడ్నీల్లో 45 రాళ్లు.. వాటి బరువు కిలో!
- ఆపరేషన్ చేసి తొలగించిన సిద్దిపేట వైద్యులు
- మూత్రకోశంలోకి జారిపోయిన రాళ్లు
- చాలా అరుదైన విషయమన్న వైద్యుడు
కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్న వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారు. భరించలేని నొప్పితో విలవిలలాడుతుంటారు. సాధారణంగా కిడ్నీల్లో నాలుగు లేదా ఐదు రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి మాత్రం కిడ్నీల్లో 45 రాళ్లు ఏర్పడ్డాయి. వాటి బరువు దాదాపు కిలో ఉంది. ఆ రాళ్లు మూత్రకోశంలోకి జారిపోయాయి.
మూత్రకోశంలో నొప్పితో బాధపడుతూ హనుమంతు (70) ఆసుపత్రికి వెళ్లాడు. స్కానింగ్ చేసిన వైద్యులు రాళ్లు ఉన్నట్లు గుర్తించి, మొదట వాటిని తొలగించేందుకు క్యాటర్ పైపు వేసి ప్రయత్నించారు. అయితే, వాటిని బయటకు తీయడం కష్టమైంది. మూత్రకోశం నిండా రాళ్లు ఉండటంతో శస్త్రచికిత్స చేశారు. మూత్రకోశం మొత్తం రాళ్లతో నిండిపోయిందని, ఇలా జరగడం చాలా అరుదైన విషయమని ఆయనకు శస్త్రచికిత్స చేసిన సిద్దిపేట వైద్యుడు శంకరరావు తెలిపారు.