Chidambaram: బ్రేకింగ్... చిదంబరానికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు!

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో భాగంగా అరెస్ట్
  • రిమాండ్ ఖైదీగా తీహార్ జైల్లో మాజీ ఆర్థికమంత్రి
  • 24 తరవాత విడుదలయ్యే అవకాశం

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి, ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు ఈ ఉదయం బెయిల్ ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 24 వరకూ ఈడీ కస్టడీ కొనసాగనుంది. దాదాపు రెండు నెలల నుంచి ఆయన జైల్లో మగ్గుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ మంజూరు అయినా, ఈడీ కస్టడీలో ఉన్నందున 24వ తేదీ వరకూ ఆయన విడుదల అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.

Chidambaram
INX Media Case
Bail
Supreme Court
  • Loading...

More Telugu News