BJP: ఆమె నాకు మసాజ్ చేస్తూ.. వీడియో తీసి రూ.5 కోట్లు డిమాండ్ చేసింది: మాజీ మంత్రి చిన్మయానంద సంచలన లేఖ

  • 23 ఏళ్ల లా విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలు
  • షాజహాన్‌పూర్ జైలు నుంచి ఎస్పీకి లేఖ
  • వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేసిందని ఆరోపణ

23 ఏళ్ల న్యాయ విద్యార్థినిపై అత్యాచారం కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద పోలీసులకు రాసిన లేఖ సంచలనమైంది. గత నెల 20న ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు షాజహాన్‌పూర్ జైలుకు తరలించారు. కాగా, తాజాగా ఆయన జైలు నుంచి షాజహాన్‌పూర్ ఎస్పీకి లేఖ రాశారు. అందులో తనపై కేసు పెట్టిన న్యాయ విద్యార్థినిపై సంచలన ఆరోపణలు చేశారు.

ఆమె తనకు మసాజ్ చేస్తూ రహస్యంగా వీడియో తీసిందని, ఆపై దానిని చూపించి రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపించారు. ఈ విషయంలో ఆమెకు సంజయ్, సచిన్, విక్రమ్ అనే స్నేహితులు సహకరించారని పేర్కొన్నారు. వారిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, బాధితురాలైన న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద కేసు పెట్టాలని కోరుతూ చిన్మయానంద తరపు న్యాయవాది చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్‌కు పిటిషన్ సమర్పించారు.  

BJP
Uttar Pradesh
swami chinmayananda
law student
  • Loading...

More Telugu News