Bay of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనానికి చాన్స్... మరిన్ని వర్షాలు!

  • గురువారం నాటికి అల్పపీడనం
  • ఇప్పటికే అరేబియాలో కొనసాగుతున్న అల్పపీడనం
  • ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం

బుధ లేదా గురువారాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని కారణంగా, వచ్చే వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని, దానికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల అవర్తనం ఉన్నందున మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఇదే సమయంలో అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఉత్తర కర్ణాటక, తెలంగాణ వరకూ 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందని అన్నారు. వీటన్నింటి ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, ఆంధ్రా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. మంగళ, బుధ వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని, ఆపై వారాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

  • Loading...

More Telugu News