Allagadda: మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • క్రషర్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్గవ్
  • హైదరాబాద్‌లో తలదాచుకున్న భార్గవ్ అనుచరులు
  • అరెస్ట్ చేసి, ఆళ్లగడ్డకు తీసుకెళ్లిన పోలీసులు

టీడీపీ మహిళా నేత, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ క్రషర్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్గవ్‌తోపాటు ఆయన అనుచరులు పదిమందిపై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. నిందితులంతా హైదరాబాద్‌లో తలదాచుకున్నారు. సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ పోలీసులు నగరానికి చేరుకుని బంజారాహిల్స్ పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఆళ్లగడ్డకు తీసుకెళ్లారు.    

Allagadda
akhila priya
bhargav
arrest
  • Loading...

More Telugu News