Bangladesh: బంగ్లా క్రికెటర్లు సమస్యను పరిష్కరించుకుంటారు: గంగూలీ

  • భారత్ లో వారి పర్యటన జరుగుతుందని ఆశిస్తున్నాను
  • బంగ్లా క్రికెట్ బోర్డు వ్యవహారంలో నేను జోక్యం చేసుకోను
  • బోర్డుతో, క్రికెటర్ల చర్చలు సఫలమవుతాయి  

తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మెకు దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్లు బోర్డుతో చర్చించి సమస్యను పరిష్కరించుకుంటారని కాబోయే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. నవంబర్ లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు, భారత్ లో పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో బంగ్లా క్రికెటర్లు సమ్మెకు దిగడం టూర్ జరిగే అవకాశాలపై అనుమానాలు రేకిత్తిస్తోంది.

ఈ అంశంపై గంగూలీ మీడియాతో మాట్లాడుతూ, పర్యటన ప్రారంభానికి సమయం ఉందని.. ఈలోపే సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా మీరు బంగ్లా క్రికెట్ బోర్డుతో ఈ విషయంపై మాట్లాడతారా? అన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు గంగూలీ సమాధానమిస్తూ.. ‘అది బంగ్లా క్రికెట్ బోర్డు అంతర్గత విషయం. అది నా పరిధిలోకి రాదు’ అని స్పష్టం చేశారు.

మరోవైపు బంగ్లా క్రికెటర్లు షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, ముష్ ఫికర్ రెహ్మాన్ సహా ఇతర ఆటగాళ్లు మీడియాతో మాట్లాడుతూ, తమ 11 డిమాండ్లను బోర్డు నెరవేర్చేంత వరకు క్రికెట్ ఆడమని ప్రకటించారు. బంగ్లా, భారత పర్యటనలో భాగంగా మూడు టీ 20, రెండు టెస్ట్ మ్యాచులు ఆడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News