Suryapet District: ముగిసిన హుజూర్ నగర్ ఉపఎన్నిక పోలింగ్ 

  • ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు
  • సాయంత్రం గం. 5 వరకు క్యూలైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం
  • మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లోను ముగిసిన పోలింగ్

తెలంగాణలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలైన్ లో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలో ముగ్గురు మహిళలు సహా 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం ఐదు గంటల వరకూ 82.23 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

అలాగే, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మహారాష్ట్రలో 288 స్థానాలకు, హరియాణాలో 90 స్థానాలకు జరిగిన పోలింగ్ లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Suryapet District
Huzurnagar
By-elections
  • Loading...

More Telugu News