Revanth Reddy: రేవంత్ రెడ్డి అరెస్ట్.. ప్రగతి భవన్ గోడలు బద్దలుకొడతామన్న రేవంత్

  • బైక్ పై ప్రగతి భవన్ వద్దకు వచ్చిన రేవంత్
  • అదుపులోకి తీసుకుని, తరలించిన పోలీసులు
  • ప్రగతి భవన్ గేట్లను తాకుతామని చెప్పి.. తాకామన్న రేవంత్

హైదరాబాదులోని ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ పై వచ్చిన ఆయనను ఆపేసి, అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ వద్ద నుంచి బలవంతంగా పోలీసు వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ నశించాలి అంటూ నినదించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలని, ప్రాణాలు అర్పించిన కార్మికుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను సవాల్ చేస్తూ ప్రగతి భవన్ గేట్లను తాకుతామని ఛాలెంజ్ చేసి తాకామని చెప్పారు. రేపు కేసీఆర్ ప్రగతి భవన్ గోడలను 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు.

Revanth Reddy
Arrest
Pragathi Bhavan
TRS
Congress
RTC
  • Loading...

More Telugu News