Narendra Modi: షారూక్, అమీర్, కంగనా... మోదీని కలిసిన బాలీవుడ్ ప్రముఖులు!

  • గాంధీ 150వ జయంతి ఉత్సవాలపై చర్చ
  • 'గాంధీ ఎట్ 150' వీడియోల విడుదల
  • పర్యాటక వృద్ధికి బాలీవుడ్ తోడ్పడాలన్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీని బాలీవుడ్ ప్రముఖుులు కలిశారు. న్యూఢిల్లీలోని మోదీ నివాసానికి వచ్చిన సినీ తారలు, నిర్మాతలు, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించడంపై చర్చలు జరిపారు. ఇదే సమయంలో 2022లో ఇండియా జరుపుకునే 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపైనా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా 'గాంధీ ఎట్ 150' వీడియోలను మోదీ విడుదల చేశారు.

షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, కంగనా రనౌత్, జాక్వలిన్ ఫెర్నాండెజ్‌, ఇంతియాజ్ అలీ, బోనీ కపూర్, ఆనంద్ ఎల్ రాయ్ తదితరులు మోదీని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, టీవీ, సినీ పరిశ్రమ ప్రముఖులు దేశాభివృద్ధిపై స్ఫూర్తిదాయక కథనాలపై దృష్టిని సారించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ పరంగానూ సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇండియాలో పర్యాటకరంగ అభివృద్ధికీ బాలీవుడ్ తారలు సహాయం చేయాలని మోదీ కోరారు.

Narendra Modi
Gandhi
Bollywood
Amir Khan
Sharook Khan
  • Loading...

More Telugu News