Andhra Pradesh: పోలీసులు వున్నది ప్రజాసేవ, ప్రజా భద్రత కోసమే: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

  • రేపటితో ముగియనున్న పోలీస్ అమరవీరుల వారోత్సవాలు
  • పోలీస్ స్టేషన్ అంటే భయపడే పరిస్థితి ఉండకూడదు
  • ఇప్పటి వరకూ 1.4 లక్షల మంది విద్యార్థులు పీఎస్ లను సందర్శించారు

పోలీసులు ఉన్నది ప్రజాసేవ, ప్రజా భద్రత కోసమేనని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గుంటూరులో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారోత్సవాల సందర్భంగా సాధారణ ప్రజలకు కూడా పోలీసుల గురించి తెలిసిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు పోటీలు నిర్వహించామని చెప్పారు. పోలీస్ స్టేషన్ అంటే భయపడే పరిస్థితి ప్రజల్లో ఉండకూడదని అన్నారు. ఇప్పటి వరకూ 1.4 లక్షల మంది విద్యార్థులు పోలీస్ స్టేషన్లను సందర్శించారని అన్నారు. కాగా, పోలీస్ అమరవీరుల వారోత్సవాలు రేపటితో ముగియనున్నాయి.  

Andhra Pradesh
DGP
Gowtam sawang
Guntur
  • Loading...

More Telugu News