TV9: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు షరతులతో కూడిన బెయిల్

  • రవిప్రకాశ్ పై ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు
  • చంచల్ గూడ జైల్లో రిమాండులో ఉన్న రవిప్రకాశ్
  • బెయిల్ కోసం ముమ్మర ప్రయత్నాలు

అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ పై కేసు నమోదు కావడం, నాటకీయ పరిణామాల మధ్య ఆయన అరెస్టు కావడం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం అనేకమార్లు ప్రయత్నించిన రవిప్రకాశ్ ఎట్టకేలకు సఫలం అయ్యారు. రవిప్రకాశ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. లక్ష రూపాయలు ష్యూరిటీ కింద సమర్పించాలని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్ ఖాతాల నుంచి అక్రమంగా నగదు దారిమళ్లించారంటూ రవిప్రకాశ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రవిప్రకాశ్ చంచల్ గూడ జైల్లో రిమాండులో ఉన్నారు.

TV9
Raviprakash
Bail
Hyderabad
  • Loading...

More Telugu News