Perni Nani: ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ వ్యవస్థను రద్దు చేసిన ఘనత జగన్ దే: పేర్ని నాని

  • ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు
  • సీఎం జగన్ నిర్ణయం
  • స్పందించిన పేర్ని నాని

ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఉద్యోగ నియామకాల్లో ఇప్పటివరకు అమల్లో ఉన్న ఇంటర్వ్యూ వ్యవస్థను రద్దు చేసిన ఘనత జగన్ కే దక్కిందని అన్నారు. జనవరిలో సీఎం జగన్ ఉద్యోగాల క్యాలెండర్ ను ప్రకటిస్తారని, అందులో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారమే నియామకాలు జరుగుతాయని తెలిపారు. లక్షకు పైగా ఉద్యోగాలను ఒకేసారి ఇచ్చి రికార్డు సృష్టించామని చెప్పుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ తో రూ.750 కోట్లు ఆదా అయినట్టు చెప్పారు. ప్రజలకు తమ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందని తెలిపారు.

Perni Nani
Jagan
APPSC
Andhra Pradesh
YSRCP
  • Loading...

More Telugu News