Sidda Raghavarao: రైతు భరోసా జాబితాలో శిద్ధా రాఘవరావు పేరు... కలెక్టర్ కు లేఖ రాసిన మాజీ మంత్రి

  • చీమకుర్తి పరిధి లబ్దిదారుల జాబితాలో పేరు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన శిద్ధా
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కు లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందించే క్రమంలో రైతు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులగా ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు బదిలీ చేస్తున్నారు. అయితే, రైతు భరోసా లబ్దిదారుల జాబితాలో తన పేరు కూడా ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు.

రైతు భరోసా లబ్దిదారుల జాబితా నుంచి తన పేరు తొలగించాలని కోరుతూ ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కు లేఖ రాశారు. చీమకుర్తి పరిధి లబ్దిదారుల జాబితాలో తన పేరు ఉండడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తన లేఖలో కలెక్టర్ ను కోరారు.

Sidda Raghavarao
Telugudesam
Andhra Pradesh
Rythu Bharosa
  • Loading...

More Telugu News