Diwakar Travels: దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసిన ఏపీ రవాణా శాఖ అధికారులు

  • దాడులు చేసిన రవాణా శాఖ అధికారులు
  • నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు గుర్తింపు
  • 23 బస్సులు సీజ్

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్ పై ఏపీ రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించడం, నియంత్రణలేని టికెట్ రేట్లు వంటి తప్పిదాలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ సీతారామాంజనేయులు, సంయుక్త కమిషనర్ ప్రసాద్ రావుల నేతృత్వంలో అనేక చోట్ల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించడం లేదన్న కారణంతో 23 బస్సులను సీజ్ చేయడంతో పాటు పర్మిట్లను రద్దు చేశారు.

Diwakar Travels
JC Diwakar Reddy
Andhra Pradesh
RTA
  • Loading...

More Telugu News