ravi prakash: నకిలీ ఐడీ సృష్టించారంటూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు!

  • ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద నకిలీ ఐడీ 
  • 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు  
  • పీటీ వారెంట్ ద్వారా మియాపూర్ కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదయింది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఆయన నకిలీ ఐడీ సృష్టించడంతో సీసీఎస్ పోలీసులు 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. టీవీ9లో రూ.18 కోట్ల నిధుల అవకతవకల కేసులో ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. ఆయనను పీటీ వారెంట్ ద్వారా పోలీసులు మియాపూర్ న్యాయస్థానానికి తీసుకొచ్చారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను తిరిగి చంచల్ గూడ జైలుకు తీసుకెళ్లారు.

కాగా, నిన్న కూడా రవి ప్రకాశ్ పై ఓ కేసు నమోదయింది. ఆయనకు చెందిన వెబ్‌ ఛానెల్స్‌లో తనపై ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేయడంతో... రవిప్రకాశ్ మీడియా హౌస్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్‌పై తాను ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినప్పటికీ, ఫిర్యాదు చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని రామారావు ఆరోపించారు.

ravi prakash
tv9
Hyderabad
  • Loading...

More Telugu News