janasena party: ఈ నెల 18, 20 తేదీల్లో ‘జనసేన’ పొలిట్ బ్యూరో, పీఏసీ సమావేశాలు

  • హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో  సమావేశాలు
  • 18 మధ్యాహ్నం పొలిట్ బ్యూరో సమావేశం
  • 20 ఉదయం 11 గంటలకు పీఏసీ సమావేశాలు

ఈ నెల18, 20 తేదీలలో జనసేన పార్టీ పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు చెప్పారు.

18వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం, 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు జరగనున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాలనా తీరుతెన్నులు, పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సమావేశాలలో చర్చించనున్నట్టు చెప్పారు. ఈ సమావేశాలు హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరుగనున్నట్లు పేర్కొన్నారు.

janasena party
Pawan Kalyan
Hyderabad
  • Loading...

More Telugu News