Telangana: పూర్తి స్థాయిలో బస్సులు నడపాలి: టీ-మంత్రి పువ్వాడ అజయ్

  • అధికారులతో టెలీ కాన్ఫరెన్ లో పాల్గొన్న పువ్వాడ
  • విద్యా సంస్థలు పున:ప్రారంభం కానున్నాయి
  • వంద శాతం బస్సులు తిప్పండి

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజల రవాణాకు ఎలాంటి ఆటంకం కలుగకుండా పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అధికారులను ఆదేశించారు. ప్రజల రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్న హైకోర్టు సూచనల మేరకు ఉన్నతాధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో డిపో మేనేజర్లు, రవాణా, ఆర్టీసీ అధికారులతో చర్చించారు.

 ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పొడిగించిన దసరా సెలవులు ఆదివారంతో ముగియనున్నాయని, 21న విద్యా సంస్థలు పున: ప్రారంభం కానుండటంతో పూర్తి స్థాయిలో బస్సులు నడపాలని సూచించారు. జిల్లాల్లో వంద శాతం బస్సులు నడుపుతున్నామని అధికారులు మంత్రికి తెలిపారు. హైదరాబాద్ లో కేవలం నలబై శాతం వరకే బస్సులు తిప్పుతున్నట్లు అధికారులు చెప్పగా, వంద శాతం బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News