Andhra Pradesh: ఏపీలో నగరాల కులాన్ని మిగిలిన తొమ్మిది జిల్లాల్లో బీసీలుగా గుర్తించాలని వినతి!

  • మంత్రి శంకర్ నారాయణకు వినతి పత్రం సమర్పణ
  • వైఎస్ హయాంలో మా కులాన్ని బీసీల్లో చేర్చారు
  • సీఎం జగన్ కూడా ఆ పని చేయాలని వినతి : శ్రీ నగరాల సంఘం నాయకులు

నగరాల కులాన్ని మిగిలిన తొమ్మిది జిల్లాల్లో బీసీలుగా గుర్తించాలని ఆ కులానికి చెందిన నాయకులు ఏపీ బీసీ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణకు విజ్ఞప్తి చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ నగరాల సంఘం నాయకులు ఈరోజు ఏపీ సచివాలయానికి వెళ్లి శంకర్ నారాయణను కలిశారు. ఈ మేరకు ఓ వినతి పత్రం అందజేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా జిల్లాలలో ఉన్న నగరాల కులస్తులను బీసీల్లో చేర్చి సామాజిక న్యాయం చేశారని శంకర్ నారాయణ దృష్టికి తెచ్చారు. తమ కులాన్ని మిగిలిన తొమ్మిది జిల్లాల్లో బీసీలుగా గుర్తించాలని సీఎం జగన్ కు విన్నవిస్తున్నట్టు తెలిపారు.

Andhra Pradesh
Nagaralu
caste
Minister
Vellampalli
Shanker Narayana
secretariat
  • Loading...

More Telugu News