Errabelli: ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ మాట్లాడతారు: ఎర్రబెల్లి దయాకర్ రావు

  • ఆర్టీసీ కార్మికులంతా కేసీఆర్ వెంటే ఉన్నారు
  • ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉపఎన్నికపై ఉండదు
  • ఉపఎన్నికలో 20 వేల మెజార్టీతో గెలుపొందుతాం

ఆర్టీసీ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. రాజకీయ నాయకులు, కార్మిక సంఘాల నేతలే ఆర్టీసీ కార్మికులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. తండ్రి పాత్రలో ఉన్న కేసీఆర్... తన పిల్లల వంటి ఆర్టీసీ కార్మికులను పిలిపించుకుని మాట్లాడతారని అన్నారు.

పిల్లలు తండ్రిపై అలగడం సహజమేనని... కానీ, తండ్రి వారిని బుజ్జగిస్తారని చెప్పారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున... ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని అన్నారు. హూజూర్ నగర్ ఉపఎన్నికలో 20 వేల మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం ఉపఎన్నికపై ఉండదని చెప్పారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Errabelli
TRS
KCR
RTC
  • Loading...

More Telugu News