JNU: నేనూ జైలు జీవితం గడిపాను!: నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ
- జేఎన్ యూలో చదువుతున్న రోజుల్లో సంఘటన
- తీహార్ జైల్లో 10 రోజులు గడిపాను
- ఓ ఇంటర్వ్యూలో అభిజిత్ వెల్లడి
నోబెల్ బహుమతికి ఎంపికైన ఇండో- అమెరికన్ అభిజిత్ బెనర్జీ జైలు శిక్షను కూడా అనుభవించారు. ఢిల్లీలోని జేఎన్ యూలో విద్యనభ్యసిస్తున్న రోజుల్లో ఓ నిరసనలో పాల్గొంటున్న సమయంలో అభిజిత్ ను పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టారు. 1983లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ నిరసన సమయంలో అభిజిత్, సహ విద్యార్థులు విశ్వ విద్యాలయం కులపతిని ఆయన ఇంట్లోనే ఘెరావ్ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ జరిపారు. ఈ విషయాలను అభిజిత్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పది రోజుల పాటు జైలులో ఉన్నామని, తమను హింసించారని చెప్పారు. తొలుత తమపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి, కొన్ని రోజుల అనంతరం వాటిని ఎత్తివేశారని అభిజిత్ తెలిపారు.