Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో మహిళను పొట్టనబెట్టుకున్న పాక్ దళాలు

  • మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
  • పూంచ్ సెక్టార్ లో కాల్పులకు తెగబడిన పాక్ సైనికులు
  • ప్రాణాలు కోల్పోయిన మహిళ

జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడం కొత్తకాదు. ఈ ఏడాది కొన్ని వందల సార్లు పాక్ సైనికులు సరిహద్దు ఆవల నుంచి కాల్పులకు తెగబడ్డారు. తాజాగా జమ్మూకశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అదను కోసం చూస్తున్న పాక్ దళాలు మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు తాజా సంఘటన నిరూపిస్తోంది. ఉగ్రవాదులను భారత్ లో ప్రవేశపెట్టేందుకు వీలుగా పాక్ సైనికులు భారత సైనిక పోస్టులపై కాల్పులు జరపడం ఎప్పట్నించో జరుగుతున్నదే!

Jammu And Kashmir
Pakistan
Poonch
  • Loading...

More Telugu News