Yogi Adityanath: యూపీలో 25 వేల మంది హోంగార్డుల ఉద్యోగాలు హుష్ కాకి!

  • యూపీ సీఎం యోగి అదిత్యనాథ్  సంచలన నిర్ణయం
  •  కానిస్టేబుళ్లతో సమానంగా డీఏ చెల్లించాల్సి వస్తుందన్న సీఎం
  • మిగతా 99 వేల మంది హోంగార్డులకు నెలకు 15 రోజులే పని

ఉత్తర ప్రదేశ్ లో హోంగార్డులుగా పనిచేస్తున్న 25 వేల మంది ఉద్యోగులను ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ఒక్కదెబ్బతో తొలగించారు. దీపావళి ముందు పెరిగిన డీఏ చెల్లిస్తారని ఆశిస్తున్న హోంగార్డులను నిరాశకు గురిచేస్తూ, ఏకంగా వారిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. నిధులు లేవన్న కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు యోగి స్పష్టం చేశారు.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. పోలీస్ కానిస్టేబుళ్ల మాదిరిగానే హోంగార్డులకు కూడా డీఏ చెల్లించాల్సి ఉంది.  హోంగార్డులకు  ఇప్పుడిస్తున్న రోజువారీ భత్యం రూ.500 నుంచి రూ. 672కు పెరిగింది. ఈ పెరిగిన డీఏ చెల్లింపులు ప్రభుత్వ ఖజానాకు భారంగా పరిణమిస్తాయన్న కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగాల్లో మిగిలిన 99 వేల మంది హోంగార్డులకు సగం పనిదినాలను ( నెలలో 15 రోజులు) కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తొలగింపుకు గురైన హోంగార్డులు గత ఏడాదే ఉద్యోగాలను పొందారు.

  • Loading...

More Telugu News