Goutam Sawang: వైఎస్ వివేకా హత్య కేసుపై స్పందించిన ఏపీ డీజీపీ

  • రాజకీయ నాయకుల మాటలను పట్టించుకోం
  • మావోయిస్టు అరుణను అరెస్టు చేయలేదు
  • పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తుతం విచారణలో ఉందని, ఇటీవల దీనిపై వస్తోన్న ఆరోపణలు, ప్రచారాలలో వాస్తవం లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ రోజు విజయవాడలో జరిగిన పోలీసుల అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సవాంగ్ మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ నిష్పాక్షికంగా కొనసాగుతోందన్నారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు చేస్తున్న ప్రకటనలు తమకు అనవసరమని పేర్కొన్నారు. పోలీసులు తమ బాధ్యతను వారు నిర్వహిస్తారని అన్నారు.

మావోయిస్టుల సమస్యపై డీజీపీ వ్యాఖ్యానిస్తూ.. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయిందన్నారు. ప్రజలు కూడా వీరి సిద్ధాంతాల పట్ల విముఖత చూపుతున్నారన్నారు. ప్రజాస్వామ్యం ద్వారానే మార్పు వస్తుందని, హింస ద్వారా కాదని పేర్కొన్నారు. మావోయిస్టు నేత అరుణ పోలీసుల అదుపులో లేదని అన్నారు. ఆ మాటకొస్తే.. ప్రస్తుతం, పోలీసుల అదుపులో ఏ మావోయిస్టు కూడా లేరని డీజీపీ స్పష్టం చేశారు.

Goutam Sawang
DGP
  • Loading...

More Telugu News