Minister: మంత్రి పువ్వాడ ఇంటి ముట్టడికి బయలుదేరిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు!

  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
  • కార్మికులతో కలిసి హైదరాబాద్ బయలు దేరుతుండగా జగ్గారెడ్డి అరెస్టు
  • సంగారెడ్డి శివారు పోలీస్ స్టేషన్ కు తరలింపు

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో కార్మికులతో పాటు కలిసి జగ్గారెడ్డి హైదరాబాద్ కు బయలు దేరుతుండగా పోలీసులు అడ్డుపడి.. ఆయనను అరెస్టు చేశారు. సంగారెడ్డి శివారు పోలీస్ స్టేషన్ కు ఆయన్ని తరలిస్తున్నట్టు సమాచారం. జగ్గారెడ్డి అరెస్టును కాంగ్రెస్ నాయకులు ఖండించారు. కాగా, సంగారెడ్డి ఆర్టీసీ డిపో వద్దకు కార్మికులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.  

Minister
Puvvada
Ajay
mla
Jaggareddy
  • Loading...

More Telugu News