Huzurnagar: రంగంలోకి దిగుతున్న బాలయ్య.. హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి సిద్ధం!

  • హుజూర్ నగర్ ఉపఎన్నికకు ఈనెల 21న పోలింగ్
  • ప్రచారాన్ని ముమ్మరం చేసిన పార్టీలు
  • 17వ తేదీన ప్రచారం చేయనున్న బాలయ్య

హుజూర్ నగర్ ఉపఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఈనెల 21 పోలింగ్ జరగనుంది. రోజులు తక్కువగా ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీడీపీ తరపున నందమూరి బాలకృష్ణ ప్రచారం చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. అదే రోజున బాలయ్య కూడా ప్రచారం చేయబోతున్నట్టు సమాచారం. మరోవైపు, 18, 19 తేదీల్లో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇప్పటికే ప్రచారం చేశారు.

Huzurnagar
Elections
Balakrishna
KCR
Revanth Reddy
TRS
Telugudesam
Congress
BJP
Lakshman
  • Loading...

More Telugu News