software engineer: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య

  • ఇన్ఫోసిస్‌లో టీం లీడర్‌గా పనిచేస్తున్న రఘురాం
  • అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్న టెక్కీ
  • అనారోగ్య సమస్యలే కారణం?

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన రఘురాం (35) గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్‌ కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తున్నాడు. భార్య శ్రీదేవి (32), కుమార్తె ప్రజ్ఞ (6)తో కలిసి చందానగర్‌లో నివసిస్తున్నాడు. శ్రీదేవి కూడా అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. రఘురాం సోమవారం  తమ కార్యాలయానికి సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్య సమస్యలే అతడి ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

software engineer
infosys
suicide
Hyderabad
  • Loading...

More Telugu News