snakehead-fish: కొర్రమీను చేపా?... అయితే చంపేయండి: అమెరికాలో అధికారుల ఆదేశాలు

  • స్థానిక చేపలకు కొర్రమీనుతో ముప్పుందని వెల్లడి
  • జీవ వైవిధ్యానికి భంగం కలుగుతోందంటున్న అధికారులు 
  • బురదలో కూడా జీవించగల చేపలివి

కొర్రమీను జాతికే చెందిన స్నేక్ హెడ్ చేపలు అమెరికా జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమించాయి. ఇప్పుడా చేపలు కనిపిస్తే చంపేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.

తమ దేశంలోని స్థానిక చేపలకు  ఈ కొర్రమీను జాతి చేపలనుంచి ప్రమాదం ఎదురవుతోందని వారు పేర్కొంటున్నారు. ఈ స్నేక్ హెడ్ ఫిష్ తన మనుగడకోసం ఇతర జాతి చేపలను, నీటిలో నివసించే   ప్రాణులను తినేస్తోందని.. దీనితో జీవ వైవిధ్యానికి భంగం కలుగుతోందని అమెరికా అధికారులంటున్నారు. అమెరికాలోని మొత్తం 15 రాష్ట్రాల్లో ఈ తరహా చేపలున్నాయని వారు చెబుతున్నారు. ఆసియా నుంచే ఈ స్నేక్ హెడ్ ఫిష్ అమెరికాలోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు..  ఈ చేపలపై అమెరికా తొలిసారిగా 2002లో నిషేధం విధించడమేకాక, రవాణాపై  ఆంక్షలు పెట్టింది.

 మరోవైపు భారత్ సహా పలు ఆసియా దేశాల్లో కొర్రమీను చేపలకు డిమాండ్ ఉంది. ఈ చేపలకు ప్రత్యేక లక్షణాలున్నాయి.  ఇవి నీరులేకపోయినప్పటికి బురదలోనైనా జీవించగలవు. నేలపై పాకుతూ.. నీళ్లున్న మడుగుల మధ్య ప్రయాణించే సామర్థ్యం దీని ప్రత్యేకత. నీళ్లులేని పరిస్థితుల్లో కేవలం గాలిలోని  ఆక్సిజన్ ను గ్రహిస్తూ జీవించే సామర్థ్యం  ఈ చేపల సొంతం. తల పామును పోలి ఉండడంతో ఈ చేపను స్నేక్ హెడ్ ఫిష్ గా   పిలుస్తుంటారు.

  • Loading...

More Telugu News