Narendra Modi: ప్రపంచ నేతల్లో ఎవరికీ లేని రీతిలో అభిమానులను సంపాదించుకున్న మోదీ

  • మోదీకి ఇన్ స్టాగ్రామ్ లో 30 మిలియన్ల ఫాలోవర్లు
  • ఇన్ స్టాగ్రామ్ లో నెంబర్ వన్ పొలిటీషియన్ గా మోదీ
  • మోదీ తర్వాత స్థానంలో ఇండోనేషియా ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో అత్యంత క్రియాశీలకంగా ఉండే ప్రపంచ నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇప్పుడాయన మిగతా ప్రపంచస్థాయి నేతలను కూడా అధిగమించి ఎవరికీ దక్కనిరీతిలో 30 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ట్విట్టర్ లో భారీ సంఖ్యలో అభిమానులున్న మోదీ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో నెంబర్ వన్ పొలిటీషియన్ గా అవతరించారు. మోదీ తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న వాళ్లలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో 25.6 మిలియన్లతో రెండో స్థానంలో ఉన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 24.8 మిలియన్లతో మూడో స్థానంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 14.9 మిలియన్ల మంది ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. మోదీకి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన పాప్యులారిటీ ఉంది. ఆయనకు ట్విట్టర్ లో ఏకంగా 50 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Narendra Modi
Instagram
Social Media
Donald Trump
Obama
  • Loading...

More Telugu News