Pope: కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసినికి సెయింట్ హోదా ప్రకటించనున్న పోప్

  • మరియం థ్రెసియాకు సెయింట్ హుడ్
  • వాటికన్ లో ప్రకటన చేయనున్న పోప్
  • మదర్ థెరిసా తర్వాత భారత్ నుంచి సెయింట్ హోదా అందుకుంటున్న మరియం

కేరళకు చెందిన మరియం థ్రెసియా అనే క్రైస్తవ సన్యాసిని సెయింట్ హోదా అందుకోనుంది. మదర్ థెరిసా తర్వాత భారత్ నుంచి సెయింట్ హోదా పొందుతున్నది మరియం థ్రెసియానే. త్వరలోనే వాటికన్ లో జరిగే ఓ పవిత్ర కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ మరియంకు సెయింట్ హోదా ప్రకటించనున్నారు. కేరళకు చెందిన మరియం థ్రెసియా 1876 ఏప్రిల్ 26న జన్మించారు. ఆమె తన 50వ ఏటనే మరణించారు. 1926 జూన్ 8న కన్నుమూశారు. తన జీవితకాలంలో క్రైస్తవంలో ఆమె సేవలు, కృషికి ఫలితంగా ప్రస్తుతం సెయింట్ హోదా ప్రకటిస్తున్నారు.

మరియంతో పాటు ఇంగ్లాండ్ కు చెందిన కార్డినల్ న్యూమన్, స్విట్జర్లాండ్ కు చెందిన మార్గరెట్ బేస్, బ్రెజిల్ కు చెందిన సిస్టర్ డూల్స్ లోప్స్, ఇటలీకి చెందిన సిస్టర్ గియుసెప్పినా వన్నినీలకు కూడా సెయింట్ హోదా అందిస్తున్నారు.

Pope
Saint
Watican
Kerala
  • Loading...

More Telugu News