MLA seethakka: పోరాడి డిమాండ్లు సాధించుకుందాం...చనిపోవద్దు : సీతక్క

  • ఆర్టీసీ అంటే నిప్పురవ్వ
  • తెలంగాణ కోసం ఆంధ్రోళ్లను తరిమికొట్టాం
  • ఉద్యమ నాయకుడు కేసీఆర్‌కు ఉద్యమాలు కనిపించడం లేదు

తెలంగాణ రక్తంలోనే పౌరుషం ఉందని, ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆంధ్రోళ్లను తరిమికొట్టిన చరిత్ర మనదని, అందువల్ల ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధనకు పోరాడడం మన ఆయుధమని, ఆ బాటలోనే ప్రయాణిద్దామన్నారు.

ఈరోజు ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ టీఎస్‌ఆర్‌టీసీ అంటే నిప్పు రవ్వని, పిరికిపంద చర్యలు వద్దన్నారు. ఉద్యమ నాయకుడినని చెప్పుకునే కేసీఆర్‌కు కార్మికుల ఉద్యమం కనిపించక పోవడం దురదృష్టకరమన్నారు. ఆర్టీసీ కార్మికురాలిపై మొన్న జరిగిన దుశ్శాసన పర్వం కేసీఆర్‌ దృష్టికి రాలేదా? అని ఆమె ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు. డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి మృతికి సానుభూతి తెలిపారు.

MLA seethakka
TSRTC
protest
  • Loading...

More Telugu News