Visakhapatnam District: సాగరతీరంలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. విశాఖలో ఐదుగురు మహిళల అరెస్ట్

  • కంచరపాలెంలోని ఓ ఇంట్లో వ్యభిచార దందా
  • సమాచారం అందించిన స్థానికులు
  • డబ్బు, సెల్‌ఫోన్లు స్వాధీనం

విశాఖపట్టణంలోని కంచరపాలెంలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న సెక్స్‌రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. మురళీనగర్‌లోని ఓ ఇంట్లో గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా  వ్యభిచారం జరుగుతోంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం ఆ ఇంటిపై దాడిచేసి వ్యభిచార ముఠా ఆట కట్టించారు. ఈ సందర్భంగా ఇద్దరు యువతులు, ముగ్గురు మహిళలు సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 5300 డబ్బు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News