RTC Driver: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఆందోళనకరం.. హైదరాబాదుకు తరలింపు

  • నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్
  • కంచన్ బాగ్ లోని అపోలో డీఆర్డీవో ఆసుపత్రికి తరలింపు
  • ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రత

టీఎస్ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. 80 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్న ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో, మెరుగైన చికిత్స కోసం ఆయనను ఖమ్మం నుంచి హైదరాబాదులోని కంచన్ బాగ్ అపోలో డీఆర్డీవో ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, ఆసుపత్రి వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో, అక్కడ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనివాసరెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. వీరిలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ, ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఉన్నారు.

RTC Driver
Srinivas Reddy
  • Loading...

More Telugu News