Mahabalipuram: సాంస్కృతిక కళా ప్రదర్శనలు వీక్షించిన మోదీ, జిన్ పింగ్

  • భారత్ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు
  • మహాబలిపురం సముద్ర తీర ఆలయంలో మోదీ, పింగ్  
  • చెన్నైకి చెందిన కళాక్షేత్ర విద్యార్థుల ప్రదర్శన

రెండు రోజుల అనధికార పర్యటన నిమిత్తం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ఆయన మహాబలిపురం వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహాబలిపురం సముద్ర తీర ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలను ప్రధాని మోదీ, జిన్ పింగ్ వీక్షిస్తున్నారు. చెన్నైకి చెందిన కళాక్షేత్ర విద్యార్థులు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అంతకుముందు, చారిత్రక కట్టడాలను మోదీ,జిన్ పింగ్ వీక్షించారు. మహాబలిపురంలోని ఆలయాల ప్రత్యేకత గురించి, రాతి శిల్పకళా కట్టడాలు, ఏకశిలా కట్టడాల విశిష్టతను, కృష్ణుడి వెన్నముద్ద శిలను జిన్ పింగ్ కు మోదీ వివరించారు.

Mahabalipuram
Pm
modi
china
JIn ping
  • Loading...

More Telugu News