Adimulapu Suresh: రైతు భరోసా జాబితాలో తన పేరుపై మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరణ

  • జాబితాను అధికారులు పరిశీలించకపోవడం వల్లే పొరపాటు
  • పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది జాబితా ప్రకటించాలి
  • పథకం అమలులో పొరపాట్లకు తావు లేకుండా చూడాలి

ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైయస్సార్ రైతు భరోసా పథకం జాబితాలో మంత్రి ఆదిమూలపు సురేశ్ పేరు రావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే . ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి వెంటనే వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడారు. జరిగిన తప్పిదంపై విచారణ జరిపించాలని ఆదేశించారు.

అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, జాబితాను అధికారులు పరిశీలించకపోవడం వల్లే పొరపాటు జరిగిందని అన్నారు. జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే రైతు భరోసా లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటించాలని ఆదేశించారు. రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని... పథకం అమలులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అన్నారు.

Adimulapu Suresh
YSR Raithu Bharosa
YSRCP
  • Loading...

More Telugu News