sangareddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

  • నియోజకవర్గం కోసం సీఎం కేసీఆర్ దగ్గర తల వంచుతా
  • సీఎంకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయను
  • సంగారెడ్డి అభివృద్ధే మాకు ముఖ్యం

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల కోసం సీఎం కేసీఆర్ దగ్గర తల వంచుతానని అన్నారు. సంగారెడ్డిలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోసం సీఎంకు వ్యతిరేకంగా తాను స్టేట్ మెంట్ ఇవ్వనని, అలాగే, ఎవ్వరూ ఇవ్వొద్దని సూచించారు. అలాగే, బీజేపీకి కూడా వ్యతిరేకంగా ప్రకటనలు చేయొద్దని సూచించారు. సంగారెడ్డి అభివృద్ధే తమకు ముఖ్యమని, తాను ఏది చేసినా నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల కోసమేనని స్పష్టం చేశారు.

sangareddy
mla
jaggareddy
cm
kcr
  • Loading...

More Telugu News