raytu bharosa: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు 'రైతు భరోసా'?

  • మంత్రి పేరున పలుచోట్ల 20 ఎకరాల భూమి
  • ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న విపక్షాలు
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐటీ పరిధిలో ఉన్న వారికి వర్తించని పథకం

ఏపీలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నామని చెబుతున్న రైతు భరోసా లబ్ధిదారుల పథకంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేరు ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐటీ జాబితాలో ఉన్న వారికి ఈ పథకం వర్తించదని ముందుగానే ప్రభుత్వం ప్రకటించింది. అటువంటిది సాక్షాత్తు మంత్రి పేరు జాబితాలో దర్శనమివ్వడంతో విపక్షాలు ఆశ్చర్యపోతున్నాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరంలో మంత్రి సురేష్‌ పేరున 94 సెంట్ల భూమి ఉంది. అలాగే కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో 19 ఎకరాల భూమి ఉన్నట్లు సురేష్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం.

raytu bharosa
minister
adimulapu suresh
  • Loading...

More Telugu News