Jagan: తండ్రి దోపిడీ బాటలోనే జగన్ కూడా నడుస్తున్నారు: ఆలపాటి రాజా

  • రివర్స్ టెండరింగ్ పేరుతో కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు:
  • వైసీపీ పాలనలో ఏపీ చీకటి రాజ్యంగా మారుతోంది
  • ఇలాంటి అసమర్థ పాలనను ఇంత వరకు చూడలేదు

ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శలు గుప్పించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ముఖ్యమంత్రి జగన్ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి వైయస్ దోపిడీ బాటలోనే జగన్ కూడా నడుస్తున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో ఏపీ చీకటి రాజ్యంగా మారుతోందని అన్నారు. రాష్ట్రంలోని జలాశయాలు నిండినా... విద్యుత్ కోతలు ఉండటం సిగ్గుపడాల్సిన విషయమని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో దోస్తీ... మన రాష్ట్ర సంపదను ఆ రాష్ట్రానికి దోచిపెట్టడానికేనా? అని ప్రశ్నించారు. ఇంతటి అసమర్థ పాలనను తన జీవితంలో చూడలేదని అన్నారు.

Jagan
Polavaram
Reverse Tendering
Alapati Raja
Telugudesam
YSRCP
YSR
  • Loading...

More Telugu News