Krishna District: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దీక్ష భగ్నం.. అరెస్టు!

  • ఇసుక కృత్రిమ కొరతను నిరసిస్తూ దీక్షకు సిద్ధం
  • కోనేరు సెంటర్‌లో శిబిరం ఏర్పాటు
  • ఆదిలోనే భగ్నం చేసిన పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కృత్రిమ కొరతను నిరసిస్తూ మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర చేపట్టిన 36 గంటల దీక్షను ఆదిలోనే పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు ఉదయం దీక్ష ప్రారంభించనున్నట్లు ముందే మాజీ మంత్రి ప్రకటించడంతో ఉదయాన్నే పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. అయితే దీన్ని ముందే పసిగట్టిన రవీంద్ర అంతకుముందే  వేరే మార్గంలో బయటకు వెళ్లిపోయారు. దీక్షా స్థలిగా నిర్ణయించిన మచిలీపట్నం కోనేరు సెంటర్‌ వద్దకు చేరుకున్నారు.

అనంతరం దీక్షకు సిద్ధమవుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడిని రవీంద్ర దీక్షకు వెళ్లకుండా పోలీసులు ముందే గృహనిర్బంధం చేశారు.

Krishna District
ex minister
kollu ravidra
fasting
  • Loading...

More Telugu News