Ayodhya: అయోధ్య వివాదాస్పద భూమిని హిందువులకు కానుకగా ఇచ్చేద్దాం!: ముస్లిం మేధావుల పిలుపు

  • వాస్తవాలను మనం అర్థం చేసుకోవాలి
  • సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా... మసీదును మనం నిర్మించుకోలేం
  • మసీదును నిర్మించుకోవడం నెరవేరని కలగానే మిగిలిపోతుంది

దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య రామ మందిరం వివాదాస్పద భూమి కేసు సుప్రీంకోర్టులో చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చర్చల ద్వారా సెటిల్ మెంట్ చేసుకోవడమే మంచిదని ముస్లిం మేధావులు కొందరు తమ అంతరంగాన్ని బయటపెట్టారు. ఈ కేసులో ముస్లింల తరపు పిటిషన్ దారులు గెలుపొందినప్పటికీ... ఆ వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించడమే బెటర్ అని వారు తెలిపారు.

మరోవైపు, వీరు తమను తాము 'శాంతి కోసం భారత ముస్లింలు' అని పేర్కొన్నారు. వీరిలో ఆలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ లెఫ్టినెంట్ జెనరల్ జమీర్ ఉద్దీన్ షా కూడా ఉన్నారు. ఆయన ఆర్మీ డిప్యూటీ చీఫ్ గా కూడా పని చేశారు.

ఈ సందర్భంగా జమీర్ ఉద్దీన్ షా మాట్లాడుతూ, 'వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను వాస్తవవాదిని. ఒకవేళ ముస్లింలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించినా... మనం అక్కడ మసీదును నిర్మించగలమా? నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తే... మసీదును నిర్మించుకోవడం అనేది ఎన్నటికీ నెరవేరని కలగానే మిగిలిపోతుంది. ముస్లింలకు అనుకూలంగా తీర్పు వచ్చినా... ఆ భూమిని మెజారిటీ ప్రజలకు బహుమానంగా ఇవ్వడమే మంచిది' అని చెప్పారు.

Ayodhya
Dispute Land
Muslim Intellectuals
Zameer Uddin Shah
  • Loading...

More Telugu News