BJP: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు ‘జడ్’ కేటగిరీ భద్రత

  • ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయం
  • నడ్డాకు రక్షణగా నిలవనున్న సీఆర్పీఎఫ్ కమాండోలు
  • దేశంలో ఎక్కడికి వెళ్లినా ఈ భద్రత వర్తిస్తుంది

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు జడ్ కేటగిరి భద్రత కల్పించారు. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందన్న భావనతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత శాఖ అధికారి ఒకరు చెప్పారు. దేశంలో ఆయన ఎక్కడికి వెళ్లినా ఇదే రకమైన భద్రత కొనసాగుతుందని సమాచారం. కాగా, నడ్డాకు జడ్ కేటగిరీ భద్రత మేరకు ఆయనకు మొత్తం 35 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు రక్షణగా నిలుస్తారు. షిఫ్టుల ప్రకారం ప్రతిక్షణం ఆయనకు కనీసం 8 మంది కమాండోలు భద్రత కల్పిస్తారు.

BJP
working president
JP Nadda
Home ministry
  • Loading...

More Telugu News