Chandrababu: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడూ అడ్డుపడలేదు: చంద్రబాబునాయుడు

  • గతంలో వైఎస్ నన్ను చాలా సార్లు విమర్శించారు 
  • నేను ప్రారంభించిన కార్యక్రమాలకు ఆయన  ఏనాడూ అడ్డుపడలేదు
  • అందుకే, హైదరాబాద్ అభివృద్ధి చెందింది

రాజధాని అమరావతిని అభివృద్ధి చెందకుండా చేసేందుకు చూస్తున్నారని, అలా జరగనివ్వమని వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు హెచ్చరించారు. విశాఖపట్టణంలో నిర్వహించిన టీడీపీ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని బతికించుకునే శక్తి తెలుగు ప్రజలకు ఉందని అన్నారు.

గతంలో వైఎస్ తనను చాలా సార్లు విమర్శించారు కానీ, తాను ప్రారంభించిన కార్యక్రమాలకు ఆయన ఏనాడూ అడ్డుపడలేదని, అందుకే, హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. ఏపీలో వున్నవి గ్రామ సచివాలయాలా? వైసీపీ కార్యాలయాలా? అని ప్రశ్నించిన చంద్రబాబు, శ్మశాన వాటికలకు కూడా వైసీపీ రంగు వేసుకుంటే బాగుంటుందని విమర్శించారు. ప్రజలే మీ ముఖాలకు రంగు వేసి బజార్లో తిప్పే రోజు వస్తుంది అని వైసీపీ నేతలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.

Chandrababu
Telugudesam
ys
Rajasheker Reddy
  • Loading...

More Telugu News