Nobel: రసాయన శాస్త్రంలో ‘నోబెల్’ పురస్కారాల ప్రకటన

  • ముగ్గురు పరిశోధకులకు ఉమ్మడిగా ఈ పురస్కారం
  • లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధికి విశేష కృషి
  • రాయల్ స్వీడిష్ అకాడమీ కమిటీ సెక్రటరీ జనరల్ ప్రకటన

ఈ ఏడాది భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం వరించింది. రసాయన శాస్త్రంలో విజేతల పేర్లను రాయల్ స్వీడిష్ అకాడమీ కమిటీ సెక్రటరీ జనరల్ గోరన్ కె.హాన్సెన్ ప్రకటించారు. స్మార్ట్ ఫోన్ లో వినియోగించే లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధికి చేసిన విశేష పరిశోధనలకు గాను జాన్ బి.గుడెనఫ్, ఎం.స్టాన్లీ విట్టింగమ్, అకిరా యోషినో కు ఈ పురస్కారాన్ని సంయుక్తంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రైజ్ మనీని ఈ ముగ్గురికి సమానంగా అందజేయనున్నారు.

కాగా, జర్మనీకి చెందిన గూడెనఫ్, బ్రిటన్ కు చెందిన స్టాన్లీ విట్టింగమ్, జపాన్ కు చెందిన యోషినోలు ప్రస్తుతం వివిధ యూనివర్శిటీల్లో పనిచేస్తున్నారు. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ లో గూడెనఫ్, బింగ్హమ్ టన్ యూనివర్శిటీలో విట్టింగమ్, జపాన్ లోని నాగోయలో మెయిజో యూనివర్శిటీ యోషినీలు ప్రయోగాలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News