Sujay Krishna Ranga Rao: ప్రజలను నేరుగా ఇసుక రీచ్ లకు తీసుకెళ్తాం: సుజయకృష్ణ రంగారావు

  • నూతన ఇసుక విధానం పూర్తిగా విఫలమైంది
  • స్టాక్ పాయింట్లలో అవసరమైన ఇసుకను ఉంచలేకపోతున్నారు
  • ఇసుకను రవాణా చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం పూర్తిగా విఫలమైందని టీడీపీ నేత, మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు విమర్శించారు. స్టాక్ పాయింట్లలో అవసరమైనంత ఇసుకను ఉంచలేకపోతున్నారని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రవాణా ఖర్చుకు ఇసుకను రవాణా చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు. టీడీపీ హయాంలో ప్రజలు స్వయంగా ఇసుక రీచ్ లకు వెళ్లి... వారి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను తీసుకెళ్లేవారని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం ఇసుకను అందించలేని పరిస్థితుల్లో... రీచ్ ల వద్దకు ప్రజలను తీసుకెళ్లి, వారే ఇసుకను తీసుకెళ్లేలా టీడీపీ మద్దతిస్తుందని చెప్పారు.

Sujay Krishna Ranga Rao
Telugudesam
YSRCP
Sand Policy
Andhra Pradesh
  • Loading...

More Telugu News