accident: మూగజీవాలపై ‘పిడుగు’.. 150 గొర్రెలు మృతి!

  • రూ.7 లక్షల విలువని అంచనా
  • గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో ఘటన
  • వెదుళ్లపల్లె రైల్వే ట్రాక్‌పై ఈరోజు ఉదయం దుర్ఘటన

ప్రకృతి ప్రకోపానికి 150 మూగజీవాలు ప్రాణాలు కోల్పోగా, వాటి పెంపకం దారులు ఆర్థికంగా భారీగా నష్టపోయారు. చనిపోయిన గొర్రెల విలువ రూ.7 లక్షలు ఉంటుందని అంచనా. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా బాపట్ల మండలం మద్దిబోయినపాలెంకు చెందిన వీరయ్య, ముసలయ్య, బాజీ, శేషయ్యకు చెందిన గొర్రెలను ఈరోజు ఉదయం బాపట్ల మండలం వెదుళ్లపల్లె రైల్వే ట్రాక్‌ సమీపంలో మేపుతున్నారు. అదే సమయంలో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమయ్యింది. కాసేపటికి ఆ ప్రాంతంలోనే పిడుగు పడడంతో మందలోని 150  గొర్రెలు చనిపోయాయి. మందపై పిడుగు పడడంతో ఒకేచోట గొర్రెల మృతదేహాలు పడివున్నాయి. ఈ ఘటనతో భారీగా నష్టపోయామని పెంపకందారులు కన్నీటి పర్యంతమయ్యారు.

accident
pidugu
150 goats died
Guntur District
bapatla mandal
  • Loading...

More Telugu News