Vizag: విశాఖ ఏజన్సీలో ఆకాశంలో వింతకాంతులు!

  • నిన్న రాత్రి నుంచి ఈ ఉదయం వరకూ కాంతులు
  • చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు
  • సోషల్ మీడియాలో వైరల్

విశాఖపట్నం జిల్లా ఏజన్సీ ఏరియాలో ఆకాశంలో వింతకాంతులు కనిపించాయి. ఏంటో తెలియని కాంతి రేఖలు మన్యం ప్రాంతంలో కనిపించడంతో గిరిజనులు ఆశ్చర్యంతో తిలకించారు. సోమవారం రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారేవరకూ ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. విషయం తెలుసుకుని వీటిని చూసేందుకు పాడేరు, అరకు, చింతపల్లి ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ వింతకాంతలను పలువురు తమ స్మార్ట్ ఫోన్లలో బంధించగా, ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి. ఇవి ఏంటో తెలియడం లేదని, కానీ, చాలాసేపు కనిపించాయని ప్రజలు అంటున్నారు.

Vizag
Mistary Lights
Manyam
Agency
  • Loading...

More Telugu News